కరీంనగర్ లోక్‌సభకు విద్యాసాగర్‌రావు శ్రీనిజామాబాద్ యెండల
మహబూబ్‌నగర్ నాగం శ్రీసికింద్రాబాద్ దత్తాత్రేయ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (జనంసాక్షి) :తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను భారతీయ జనతా పార్టీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రకటించింది. టీడ ీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న బీజేపీ 47 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేం దుకు ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత 21 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సికింద్రాబాద్ నుంచి సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఆఖరి అవకాశం కల్పించింది. ఈ సీటు నుంచి పో టీ చేయాలని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ఒత్తిడి పెంచిన అధినాయకత్వం చివరికి దత్తాత్రేయకే సీటు ఇచ్చింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డికి మహ బూబ్‌నగర్ ఎంపీ సీటు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణకు నిజా మా బాద్ పార్లమెంట్ స్థానాన్ని ఖాయం చేసింది. మెదక్ నుంచి నరేంద్రనాథ్, హైద రాబాద్ – భగవంతరావు, వరంగల్ – రామగల్ల పరమేశ్వర్‌కు టికెట్లు ఇచ్చింది. అసెంబ్లీ అభ్యర్థులు : ముషీరాబాద్ : డాక్టర్ లక్ష్మణ్, ఉప్పల్ – ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, దుబ్బాక – రఘునందన్‌రావు, సంగారెడ్డి- సత్యనారాయణ, ధర్మపురి – అంజయ్య, కోరు ట్ల సురభి భూంరావు, నిజామాబాద్ – సూర్యనారాయణగుప్తా, ఎల్లారెడ్డి బాణాల లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్ – నాగం శశిధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జన గామా – కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులకు టికెట్లు ఖరారు చేశారు. మరో 27 అసెంబ్లీ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థుల జాబితాను బుధవారం తెల్లవా రుజాములోగా ప్రకటించే అవకాశముంది.
భాజపా తొలిజాబితా విడుదల





