(జనంసాక్షి) :హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను కడ్నాప్ చేసి సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు మృగాళ్లు. చాంద్రాయణగుట్టలోని హఫీజ్ బాబానగర్ కు చెందిన 15ఏళ్లు ఓ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించమంటూ వేధించసాగాడు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో ఈనెల 4న నలుగురు స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి అనంతరం అఘాయిత్యానికి ఒడిగట్టారు. మృగాళ్ల నుంచి తప్పించుకొనన్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.