భార్యను ముక్కలుగా నరికిన భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం 500 రూపాయలు పోగొట్టిందని భర్త ఆమెను కర్రలతో అతి దారుణంగా కొట్టాడు. ఆ తరువాత ముక్కలునా నరికేశాడు.మొదటి భార్యను కూడా అతనే హత్య చేసినట్లు చెబుతున్నారు. చిన్న కారణంగానే రెండవ భార్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.