Tuesday, 3 November 2026

గుల్జార్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు


ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
త్వరలో ప్రదానం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ప్రఖ్యాత సినీ గేయ రచయిత గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దర్శకుడి, నిర్మాత, రచయిత, కథ నం తదితర రంగాలలో భారతీయ సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా గుల్జార్‌ను ఆ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపిం ది.భారతీయ సినిమా పురోగతికి విశేషమైన సేవలు అందించారని గుల్జార్‌ను ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. 45వ దాదాపాల్కే అవార్డును త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు అందజే యనుంది. గుల్జార్‌ అసలు పేరు సంపూర్ణ సింగ్‌ కలరా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *