Tuesday, 3 November 2026

దక్షిణ కొరియాలో నీట మునిగిన నౌక

293 మంది గల్లంతు
బయోంగ్‌పూంగ్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :
దక్షిణకొరియా దక్షిణ సముద్రతీరంలో ప్రయా ణికులతో వెళ్తున్న నౌక ‘సెవల్‌’ మునిగిపోయిం ది. ఈ ప్రమాదంలో 293 మంది గల్లంతయిన ట్టు దక్షిణకొరియా అధికారవర్గాలు ప్రకటించా యి. నౌకలో మొత్తం 459 మంది ప్రయాణికులు న్నారని వారిలో ఇప్పటివరకు 368 మందిని రక్షించినట్టు వెలువడిన వార్తలను ఆ దేశప్రభుత్వ వర్గాలు ఖండించాయి. మొత్తం
459 మందిలో ఇప్పటివరకు 164 మందిని మాత్రమే కాపాడినట్టు వారు తెలిపారు. నౌక సిబ్బందిలో ఒకరు, ప్రయాణికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. సెవల్‌ నౌక లించెన్‌ నుంచి పర్యాటక దీవి జెజుకు ప్రయాణిస్తోండగా బయోంగ్‌పుంగ్‌ ద్వీపం దగ్గర సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రయాణికుల్లో ఎక్కువమంది విద్యార్థులే. వీరంతా జెజు ద్వీపానికి విహారయాత్రకు వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే దక్షిణకొరియా వైమానికదళానికి చెందిన 12 విమానాలు, హెలిక్టాపర్లు రంగంలోకి దిగాయి. నౌక అడుగుభాగంలో రెస్టారెంట్లు, దుకాణాలు ఉన్నాయి. ఇక్కడున్న వారే ఎక్కువమంది గల్లంతు కావడం గమనార్హం. సహాయకచర్యల కోసం అమెరికా రక్షణ నౌక ఒకటి ప్రమాదస్థలానికి బయలుదేరింది. ఈ నౌను 1994లో జపాన్‌లో నిర్మించారు. 146 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు. నౌకలో మొత్తం ప్రయాణీకుల సామర్థ్యం 921మంది వరకు ఉంటుంది. 180 వాహనాలను 152 కంటైనర్లను ఏకకాలంలో తీసుకువెళ్ల సామర్థ్యం ఈ నౌకకు వుంది. సముద్రంలోని 30 మీటర్ల లోతులో మునిగిపోయిందని దక్షిణకొరియా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *