Tuesday, 3 November 2026

ఢిల్లీ హైకోర్టు సీజేగా రోహిణి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రోహిణి బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఢిల్లీ హైకోర్టు సీజీగా బాధ్యతలు చే పట్టిన రెండో తెలుగు న్యాయమూర్తి కావ డం విశేషం. ఇప్పటివరకూ ఏపీ హైకోరు ్టలో న్యాయమూర్తిగా జస్టిస్‌ రోహిణి సేవ లందించారు. ఆమె పదోన్నతిపై ఢిల్లీ హై కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 1955 ఏప్రిల్‌ 14న విశాఖపట్నంలో జ న్మించిన జస్టిస్‌ రోహిణి, 1976లో ఉస్మా నియా విశ్వవిద్యాలయం
నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు. 1980 డిసెంబర్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నాటి బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా చేరారు. రాఘవరావు చీఫ్‌ ఎడిటర్‌గా ఉన్న ఆంధప్రదేశ్‌ లా జర్నల్స్‌కు ఆమె రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. 1995లో హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌గాను, 2001లో అదనపు జడ్జిగాను, 2002 నుంచి పూర్తి స్థాయి జడ్జిగాను ఆమె నియమితులయ్యారు. అప్పటినుంచి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. ఆమె తన నియామకం తరవాత సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ రోహిణి ప్రమాణస్వీకారం చేశారు. రోహిణితో ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ ప్రమాణం చేయించారు. ఢీల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జ్టసిస్‌ రోహిణి ఘనత వహించారు. ఇంతకుముందు జస్టిస్‌ రమణ కూడా ఇక్కడ పనిచేశారు.