సీమాంధ్రకు కొత్త రాజధానికి సలహాలివ్వండి
హైదరాబాద్, ఏప్రిల్ 22
(జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలంపై సలహాలివ్వండి అంటూ శివరామకృష్ణన్ నేతృ త్వంలోని నిపుణుల కమిటీ కోరింది. ప్రజల నుంచి తాము సలహాలు, సూచనలు కోరుతున్నట్టు శివరామకృష్ణన్ పేర్కొ న్నారు. ప్రజలు తమ సూచనలు, సలహాలు ఆగస్టు 31లోగా కేంద్ర హోం శాఖకు నివేదిస్తామని ఆయన తెలిపారు. అందుకోసం ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 30వ తేదీలోగా ఈమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ నిపుణుల కమిటీ అభిప్రాయాలను తీసుకోనుంది. భూమి లభ్యత, నీరు, సహజవనరులు, అడవులు, డీరిజర్వ్ చేసిన ప్రాంతాలను కొత్త రాజధానికి హైదరాబాద్‌కు ఉన్న రవాణా మార్గాలను కమిటీ పరిశీలించనుంది. ప్రభుత్వ భవనాలకు అనువైన స్థలాలను కమిటీ సూచిస్తుంది. ప్రజలను తమ అభిప్రాయాలను టవవసపaషస. వఞజూషశీఎ్‌ఏ ఎష్ట్రa.స్త్రశీఙ.ఱఅకు ఈమెయిల్ చేయాలని సూచించింది.