Monday, 2 November 2026

నిందిస్తే మరింత బలపడతాం : ప్రియాంక


రాయబరేలి, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు తన భర్తను టార్గెట్‌గా చేసుకొని నిందారోపణలు చేస్తే మ రింత బలపడతామని కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ కుమార్తె ప్రియాంక అన్నారు. రాజకీ య కారణాలతో తన భర్త రాబర్ట్‌ వాద్రాపై చేస్తు న్న ఆరోపణలు తనను కలచి వేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రత్యర్థుల దాడి పెరిగినా కొ ద్ది తమలో పోరాట స్ఫూర్తి దృఢమవుతుందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని రాజకీ యంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని ఆమె అన్నారు. మంగళవారం ఆమె తన తల్లి తరపు న రాయబరేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. యూపీఏ హయాంలో జరిగిన అభివృ ద్ధి అంశాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టి మరల్చేందుకు తన భర్తపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. తన భర్తకు సంబంధిం చిన నిజానిజాలు కచ్చితంగా ప్రజలకు తెలుస్తా యని అన్నారు. ‘మీరు టీవీ చూసినప్పుడల్లా ఏం కనిపిస్తోంది? నా కుటుంబాన్ని అవహే ళన చేస్తూ ఏవేవో మాట్లాడుతున్నారని’ ప్రజల నుద్దేశించి అన్నారు. ఎవరో అవహేళన చేశార ని కాదని నిజాలు దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బాధ పడుతున్నానని తెలిపారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయం టూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *