అన్ని పార్టీల నిర్ణయం మేరకే రాష్ట్ర విభజన జరిగింది : రాహుల్ గాంధీ
హిందూపురం: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఓటర్లను చేరుకున్న రాహుల్ గాంధీ సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా తెచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం మాత్రమేనని బుధవారం ఇక్కడ బహిరంగ సభలో పేర్కొన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ పట్టుబట్టామని రాహుల్ తెలిపారు. “ఆ విధంగా మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చాం” అని ఆయన అన్నారు.”దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు ఈ రాష్ట్రానికి వస్తాయి. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఎయిమ్స్, పెట్రోలియం, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం” అని రాహుల్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ కుటుంబానికి గల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. “మా కుటుంబంతో ఆంధ్రాకు చాలా పురాతనమైన పటిష్టమైన అనుబంధం ఉంది మరీ ముఖ్యంగా మా బామ్మ ఇందిరా గాందీగారితో..” అని రాహుల్ తెలిపారు. “దేశంలోకెల్లా సీమాంధ్రలోనే ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు” అని ఆయన చెప్పారు.
Related