Monday, 2 November 2026

శౌర్యులకు పతకాలు


ప్రదానం చేసిన రాష్ట్రపతి
పాల్గొన్న
ఉప రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ, మే 2
(జనంసాక్షి) :
దేశ రక్షణకు విశేషమైన సేవలందించిన సాయిధ దళాల అధికారులకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శౌర్య చక్ర పురస్కారాలను అందజేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. తొమ్మిది శౌర్యచక్ర, మూడు కీర్తిచక్ర పురస్కారాలతో పాటు మరికొన్ని ప్రత్యేక పురస్కారాలను గ్రహీతలకు రాష్ట్రపతి అందజేశారు. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నాయక్‌ బల్వీందర్‌ సింగ్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ప్రకాశ్‌ రంజన్‌ మిశ్రా శౌర్యచక్ర, ఎయిర్‌ మార్షల్‌ ధనుంజయ్‌ పరుశురామ్‌, వైస్‌ అడ్మిరల్‌ సురీందర్‌ పాల్‌సింగ్‌ పరమ విశిష్ట సేవా పతాకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. మరణాననంతరం కొందరికి పురస్కారాలు దక్కాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోని హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *