Tuesday, 3 November 2026

ప్రశాతంగా మొద‌లైన‌ పోలింగ్ : భన్వర్‌లాల్

 హైదరాబాద్, మే 7 : సీమాంధ్ర జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో ఈ ఉదయం 9 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. ఈవీఎంలు మొరాయించిన చోట్ల కొత్తవి ఏర్పాటు చేశామన్నారు.అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఒకట్రెండు ప్రాంతాల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పార్టీలు సహకరించాలని భన్వర్‌లాల్ కోరారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు :
* శ్రీకాకుళం : 14 శాతం
* విజయనగరం : 19 శాతం
* విశాఖపట్నం : 11 శాతం
* తూగో : 16 శాతం
* పగో : 17 శాతం
* కృష్ణా : 13 శాతం
* గుంటూరు : 12 శాతం
* ప్రకాశం : 14 శాతం
* నెల్లూరు : 11 శాతం
* కడప : 17 శాతం
* కర్నూలు : 15 శాతం
* అనంతపురం : 16 శాతం
* చిత్తూరు : 21 శాతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *