175 అసెంబ్లీ
25 ఎంపీ స్థానాలకు పోలింగ్

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, ఎన్నికల కమిషన్ పటిష్టచర్యలు చేపట్టింది. లక్షా 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు రక్షణశాఖ హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలవద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ జిల్లాల్లో పోలిస్తే సీమాంధ్ర జిల్లాల్లో సహజంగానే పోలింగ్ అధికంగా ఉంటుందని. ఇప్పటికే అంతా అంచనాకు వచ్చారు. ఓ వైపు లక్షల సంఖ్యలో ఉన్న యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఉత్సాహంతో ఉండడంతో ఈ సారి సీమాంధ్రలో పోలింగ్ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ సారి ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం తమతమ గ్రామాలకు వెళ్ళారు.
పోలింగ్ ప్రక్రియలోనూ ఓటర్లకు గుర్తింపు కార్డులు చూపించే విషయంలో మినహాయింపులు ఇచ్చారు. ఓటర్ల జాబితాలో పేరు ఉంటే చాలు..ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలింగ్ సిబ్బందికి ఈసీ ఆదేశాలిచ్చింది. ఓటరు స్లిప్పులు లేక పోయినా ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఆధార్, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంక్ ఎకౌంట్ల పాసు పుస్తకం, ఉపాథి హామీ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, ఫోటోతో ఉన్న ఉద్యోగ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, స్మార్ట్‌కార్డు, కార్మికశాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, పెన్షన్ బుక్ ఇలా 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళితే ఓటర్లకు మరీ మంచిది. వీటిలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.




