హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పరిసరాల్లో అల్పపీడనం ఆవరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రైతాంగం నిండా మునిగిన సంగతి తెలిసిందే. భారీ వర్ష సూచనలతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు.




