హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఉద్యోగుల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈమేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు ఆప్షన్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆప్షన్లు ఇస్తూ అండర్‌టేకింగ్ సమర్పించాలని కోరారు. ఈనెల 16లోగా అధికారులు తమ ప్రాధాన్యతలు తెలపాలని పేర్కొన్నారు. తెలంగాణలో, సీమాంధ్రలో ఎక్కడైనా ఫర్వాలేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించారు.




