
హైదరాబాద్, మే 10 : సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్‌పై సీఈసీ నుంచి శనివారం సాయంత్రానిని నివేదిక వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 12న లేదా 13న రీపోలింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కాకినాడ జేఎన్‌టీయూలో భద్రపరిచిన ఈవీఎంలకు ఎలాంటి నష్టం జరగలేదని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు.




