టీఆర్‌ఎస్ నేత రాములు దారుణ హత్య
నయీం ముఠాగా అనుమానం
పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘాతుకం
ఖండించిన కేసీఆర్
నల్గొండ, మే 11 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత కోనపురి రాములు(40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశా రు. పట్టపగలే అందరూ చూస్తుండగానే కళ్ల లో కారం చల్లి తుపాకీ కాల్చి చంపేశారు. న ల్గొండలోని మిర్యాలగూడ రోడ్డులో గల బేగ్ ఫంక్షన్‌హాల్‌లో ఈ దారుణం జరిగింది. తన స్నేహితుడు, న్యూడెమోక్రసీ
నేత పర్వతాలు కుమార్తె వివాహానికి హాజరైన రాములు తిరిగి వస్తుండగా ఫంక్షన్‌హాల్ సమీపంలోని పొదల్లో మాటు వేసి ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రాములుతో పాటు ఆయన గన్‌మన్లపై కారంపొడి చల్లారు. అనంతరం గన్‌మెన్లను నిర్బంధించి రాములును అతి సమీపంలోంచి తలమీద, ఛాతి మీద కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాములు పీపుల్స్‌వార్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడు సోదరుడు. ఏడాదిన్నర క్రితం సాంబశివుడిని హత్య చేసిన ముఠానే రాములను చంపినట్లుగా అనుమానిస్తున్నారు. మాజీ మావోయిస్టు నయీం ముఠా ఈ దారుణానికి ఒడి గట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐదు తుటాలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాములు స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం. నల్గొండ అడిషనల్ ఎస్పీ రమారాజేశ్వరి, డీఎస్పీ రామ్మోహన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం సంఘటన స్థలంలో ఆరు బులెట్లు, రాములు చెప్పులు, గుర్తు తెలియని వ్యక్తుల చెప్పులు, కారంపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి కిలోమీటర్ దూరంలోని రైలు పట్టాల వైపు, అద్దండి బైపాస్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి వచ్చాయి. నిందితులు బైపాస్‌రోడ్డు వద్ద నుంచి వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టు పార్టీలో పనిచేసిన తన భార్య కవితతో కలిసి 2007 జూన్ 13న హైదరాబాద్‌లో డీఐజీ ఎదుట లొంగిపోయాడు. 2008లో ఆయనపై రెండు పర్యాయాలు హత్యాయత్నం జరిగింది. ఒకసారి విష సర్పాలను ఇంట్లోకి వదిలారు. మరోసారి ఆయన తినే ఆహారంలో విషం కలిపారు. హైదరాబాద్ కొత్తపేటలో ఒకసారి, 2013 ఏప్రిల్‌లో పోచంపల్లి మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నప్పుడు మరోసారి ఆయనపై హత్యాయత్నం చేశారు. టీఆర్‌ఎస్ నేత కోనపురి రాములు హత్యను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. రాములును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- నేడు మన్మోహన్ సింగ్‌కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- అంబేడ్కర్‌ను అవమానిస్తావా!
- కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలకు అనుకూలం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మరిన్ని వార్తలు