
తెరాసలో చీలికరాదు : హరీశ్
హైదరాబాద్, మే 11 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎ లాంటి చీలికా రాదని, అలాంటి దేదో జరగబోతుందంటూ కాం గ్రెస్ నాయకులు కలలు కనడం మానాలని, పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని టీఆర్ ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబా ద్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయ కులు టీఆర్‌ఎస్ నేతలకు ఎలాం టి ఎరలు వేసినా వారు పార్టీ మారబోరని హరీశ్ తేల్చిచెప్పా రు. తెలంగాణలో నూటికి నూరుపాళ్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని అం దులో ఎలాంటి తిరుగులేదని ఆయన స్పష్టం చేశారు. తాము తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఘననీయంగా సీట్లు సాధిసా ్తమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ పా ర్టీ ఎమ్మెల్యేలపై వల విసిరితే అది వారికే చుట్టుకుంటుందని, వలలో పడి గిలాగిలా కొట్టుకుంటారని అన్నారు. టీఆర్‌ఎస్ కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నేతలను ి
గందరగోళ పరిచేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించామని, తెలంగాణ పునర్నిర్మాణానికి ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను నిఖార్సయిన టీఆర్‌ఎస్ కార్యకర్తనని, పార్టీలో సాధారణ కార్యకర్తగా కూడా పనిచేసేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. ఎన్నికల్లో ఓటరు తీర్పు తర్వాత టీడీపీ నాయకులకు దిక్కు తోచక తప్పుడు ప్రేలాపణలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు.
పిచ్చివాగుడు మానండ




