Tuesday, 3 November 2026

13న 29 కేంద్రాల్లో రీ పోలింగ్‌ : భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :
రాష్ట్రంలోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో 13న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. గతనెల 30న తెలంగాణ జిల్లాల్లో, ఈనెల 7న సీమాంధ్రల్లో జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన 29 కేంద్రాల్లో మళ్లీ పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
రీపోలింగ్‌ నిర్వహించే కేంద్రాలు : నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరి ధిలోని బోధన్‌ శాసనసభ నియోజకవర్గంలోని 64వ పోలింగ్‌ కేంద్రం, నిజామాబాద్‌ రూరల్‌లోని 9, 48, 168 పోలింగ్‌ కేంద్రాలు, జహీరాబాద్‌ ఎంపీ పరిధిలోని జుక్కల్‌ శాసనసభ నియోజకవర్గంలో గల 143వ పోలింగ్‌ కేంద్రం, బాన్సువాడలోని 146, 39, 187 పోలింగ్‌ స్టేషన్లు, మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి కూకట్‌పల్లిలోని 371 /ఏ, ఖమ్మం ఎంపీ పరిధిలోని కొత్తగూడెంలో గల 161, భద్రాచలంలోని 239, శ్రీకా కుళం ఎంపీ పరిధిలోని శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలోని 46, కురుపాం లోని 192, సాలూరులోని 134, పాడేరులోని 68, గుడివాడలోని 123, అవనిగడ్డ లోని 91, పెనమలూరులో 59, 172, విజయవాడ ఈస్ట్‌లోని 212, మైలవరంలోని 123, నందిగామలోని 171, 174, జగ్గయ్యపేటలోని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *