Monday, 2 November 2026

పెళ్లికొడుకైన ఎన్డీ తివారి…

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ ఎన్జీ తివారీ 88 ఏళ్ల వయసులో వివాదాలన్నిటికీ ఫుల్‌స్టాప్ ‌పెడుతూ పెళ్లికొడుకు అయ్యారు. ఒకప్పటి తన మాజీ ప్రేయసి ఉజ్వలా శర్మను తివారీ ఈ రోజు ఉదయం లక్నోలో వివాహం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన మాజీ ప్రొఫెసర్ ఉజ్వలా శర్మకు తివారీ ద్వారా గతంలో రోహిత్ శేఖర్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. రోహిత్ శేఖర్ ఎన్డీ తివారీనే తన తండ్రి అంటూ న్యాయస్థానంలో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ఇటీవలే రోహిత్‌ను తన కుమారుడిగా అంగీకరించారు. అనంతరం తివారీ వివాహ ప్రతిపాదన తేవడంతో తాను అంగీకరించినట్లు ఉజ్వలా శర్మ తెలిపారు. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని ఆమె వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *