
హైదరాబాద్, మే 15 : ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె తొలితరం స్త్రీవాద రచయిత్రిగా పేరుపొందారు. 1924 ఆగస్టు 2న మల్లాది సుబ్బమ్మ గుంటూరు జిల్లా, రేపల్లే పోతార్లంకలో జన్మించారు. మహిళాభ్యుదయ, అభ్యుదయ వివాహవేదిక, వయోజన విద్యాకేంద్రం తదితర మల్లాది సుబ్బమ్మ 12 సంస్థలను స్థాపించారు.
మహిళాభ్యుదయ కోసం విశేష కృషి చేసిన మల్లాది సుబ్బమ్మ 60కి పైగా విశేష రచనలు చేశారు. వికాసం, స్త్రీ స్వేచ్ఛా అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఆమె పనిచేశారు. సారా, మద్య వ్యతిరేక ఉద్యమంలో మల్లాది సుబ్బమ్మ పాల్గొన్నారు. ఆమె రచించిన రచనలు మాతృత్వానికి మరోముడి, కాంతి కిరణాలు, చీకటి వెలుగులు, ఈ దేశం నాదేనా?, వెలిగిన జ్యోతి, మహిళల హక్కుల లాంటి రచనలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఒక వైపు గృహిణిగా మల్లాది సుబ్బమ్మ తన బా«ధ్యతలు నిర్వహిస్తూ, భర్త రామ్మూర్తి గారి సహకారంతో అనేక ఉద్యమాల్లో ఆమె




