న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురవడంతో ఆ పార్టీ కార్యకర్తల బృందం శుక్రవారం ఏఐసిసి ప్రధాన కార్యాలయం వెలుపల సమావేశం నిర్వహంచారు. కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడేందుకు ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్త జగదీష్ శర్మ నాయకత్వంలో 30 మంది కార్యకర్తలు ఏఐసిసి కార్యాలయం ఎదుట ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటి వరకూ జరిగిన ఏ లోక్‌సభ ఎన్నకల్లోనూ ఇంతటి పరాభవం చవిచూడలేదని, ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటూ ‘‘వక్త్ కి పుకార్ ప్రియాంక గాంధీ’’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు.
Related