Monday, 2 November 2026

దామోదర రాజనర్సింహా ఓటమి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ తరుపున కీలక పాత్ర పోషించిన మాజీ ఉప ముఖ్యమంత్రి – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రచార కమిటీ సారధి దామోదర రాజనర్సింహ ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సినీ నటుడు – తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ మంత్రిగా పని చేసిన బాబు మోహన్, రాజనర్సింహపై 3500 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు గట్టిగా వినిపించిన దామోదర రాజనర్సింహ ఓటమి ఆపార్టీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *