హైదరాబాద్, మే 18 : విభజన ప్రక్రియపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మహంతితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖలవారీగా భవనాలు, కార్యాలయాల కేటాంపు, ఉద్యోగుల విభజనపై దృష్టి పెట్టినట్లు తెలియవచ్చింది. వాస్తవానికి ఈనెల 15లోగా విభజన ప్రక్రియను పూర్తి చేయాలని విభజన కమిటీలను గవర్నర్ ఆదేశించారు.
గవర్నర్ ఆదేశాల ప్రకారం కొన్ని కమిటీలు నరసింహన్‌కు నివేదికలు అందించాయి, మరికొన్ని కమిటీలు మాత్రం ఇంకా నివేదికలు ఇవ్వలేదు. దానిపై కూడా ఈరోజు గవర్నర్ సమీక్ష జరిపారు. వీలైనంత త్వరగా నివేదికలు ఇవ్వాలని ఆయన సూచించారు. జూన్ 2 తెలంగాణ అపాయింట్ డే దగ్గర పడుతుండడంతో ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నరసింహన్ విభజన కమిటీలను ఆదేశించారు.




