హైదరాబాద్, మే 18 : నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో జనం కాస్త ఉపసమనం పొందారు. దీంతో హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఆగ్నేయ బంగాళఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల 24 గంటల్లో రుతుపవనాలు బంగాళఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే అండమాన్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
దక్షిణ తమిళనాడు నుంచి కోస్తా ఆంధ్రా తీరం వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించినట్లు సమాచారం. ఈ కారణంగా పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు చోట్ల ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్ 10 నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.




