ఖమ్మం : జిల్లాలో కిరాణా కొట్టు నడుపుకుంటున్న మహిళన దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన జిల్లాలోని బోనకల్ మండలం నారాయణపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలిని సిహెచ్ బుజ్జి(45)గా గుర్తించారు. బోనకల్ ఎస్సై టి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త గత ఐదేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు పిల్లులు కూడా లేకపోవడంతో నారాయణపురంలో ఒంటిరిగా, కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. కాగా అదే గ్రామానికి చెందిన బి. కుటుంబరావు ఆమె షాపులో ఖాతా పెట్టి రోజూ కిరాణా సరుకులు కొనుగోలు చేసేవాడు. ఈ ఖాతా అధికమవడంతో బుజ్జి డబ్బు చెల్లించాలని కుటుంబరావుని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటు చేసుకోగా కుటుంబరావు పక్కనే ఉన్న పదునైన రాయితో బుజ్జి గొంతును కోసి పరారయ్యాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బుజ్జిని స్థానికులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించగా మార్గంమధ్యలోనే మరణించింది. దీనిపై బోనకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందుతున్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Related