జౌన్పూర్(ఉత్తర ప్రదేశ్): ఉత్తర ప్రదేశ్ మంత్రి, ఆయన సిబ్బంది ఇద్దరు ఈ రోజు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. లినేబజార్ ప్రాంతంలో రైలు గేటు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్రాసింగ్ వద్ద గార్డు లేరని వారు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి, ఎస్పీ నేత సతాయ్ రామ్ యాదవ్(61) కారులో వెళ్తుండగా కల్షాహా క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ఈ రోజు ఉదయం జౌన్పూర్-ఔరిహర్ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ప్రమాదంలో యాదవ్, ఆయన గన్ మెన్ బిక్రం వర్మ(27), డ్రైవర్ రోహిత్ దీక్షిత్(35) అక్కడికక్కడే మృతిచెందారు.
Related