Tuesday, 3 November 2026

అంశాల వారీగా ఎన్డీయేకు మద్దతిస్తాం

మోడీ, రాజ్‌నాథ్‌లతో జగన్మోహన్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ: కేంద్రంలో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వానికి తమ పార్టీ అంశాల వారీగా మద్దతును ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడిక్కడ పార్టీ సీనియర్ నాయకులతో కలసి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడి గుజరాత్ భవన్‌లో కలుసుకున్న జగన్ ‘‘ఆయన(మోడి) అవసరం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతైనా ఉంది’’ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 9 స్థానాలను గెలుచుకున్న మీ పార్టీ ఎన్డీయేలో చేరుతుందా అన్న ప్రశ్నకు ‘‘ఏ రాజకీయ పార్టీ మద్దతు బిజెపికి అవసరం లేదు’’ అని జగన్ అన్నారు. ‘‘వారికి ఇప్పటికే 282 ఎంపీల బలం ఉంది. మా మద్దతు వారికి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన అవసరం చాలా ఉంది’’ అని జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై మోడికి ఒక వినతిపత్రాన్ని జగన్ ఈ సందర్భంగా అందచేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వాగ్దానం చేసిన మేరకు సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మించడానికి ఉదారంగా నిధులు మంజూరు చేయాలని ఆయన మోడిని కోరారు. అనంతరం జగన్ బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన టిడిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంతోపాటు ఎన్డీయేలో భాగస్వామ్యం పక్షంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *