హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘం నేత అయిన తనను ఆంధ్రాకు కేటాయించడం అన్యాయమని విఠల్ పేర్కొన్నారు. అధికారులు తనను అన్యాయంగా ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది పెరిగింది మెదక్‌లో, మా తతల కాలం నుండి ఇక్కడే ఉన్నాం అలాంటప్పుడు నన్ను ఆంధ్రా ఇంటర్ బోర్డుకు ఎలా పంపిస్తారు’’ అని విఠల్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ఉద్యోగుల కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల కేటాయింపు ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు.
Related