Tuesday, 3 November 2026

కయ్యానికి కాలు దువ్వితే దేనికైనా రెడీ : కేసీఆర్

తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులకు స్థానం లేదు,

 

హైదరాబాద్, మే 22 : తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులకు స్థానం లేదని, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో ఉండాలని, ఆంధ్రా ఉద్యోగులు సీమాంధ్రలో ఉండాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం కొంపల్లిలో టీ. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ ఒక వేళ  కావాలని కయ్యానికి కాలు దువ్వితో దేనికైనా రెడీ అని అన్నారు. న్యాయం కోసం కోట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యోగులు ముందు నుంచి సహనంతో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ర్టాలు విడిపోయినా తమకు స్వేచ్ఛ లేకుంటే సహించేదే లేదన్నారు. తెలంగాణ ఉద్యోగులు మాత్రమే తెలంగాణలో ఉండాలన్నారు. ఆంధ్రా ఉద్యోగులు ఉండటానికి వీలే లేదని స్పష్టం చేశారు. ఎవరి సచివాలయాల్లో ఆ ప్రాంత ఉద్యోగులు ఉంటేనే మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించమని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగుల కృషి చాలా ఉందని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగుల సకల జనుల సమ్మె అద్భుతమని  ఆయన కొనియాడారు. మీడియాలో, వార్తా పత్రికల్లో వస్తున్నట్లు ఉద్యోగుల పంపిణీ జరగదని  కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో ఆంధ్రోళ్లు ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు.  ప్రభుత్వాన్ని నడపడానికి తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు సీఎస్ చెప్పారని కేసీఆర్ తెలిపారు. ఒక్క ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల పంపిణీ మాత్రమే డీఓపీ ప్రకారం జరుగుతదని, జూన్ 2 వరకు ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల పంపిణీ జరగదని కేసీఆర్  స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *