హైదరాబాద్, మే 22 : ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రెండో రోజు జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశాల్లో సురవరం మాట్లాడుతూ వెజార్టీ ఉంది కదా అని బీజేపీ సర్కార్ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే వూరుకోబోమని ఆయన హెచ్చరించారు. లౌకికవాదాన్ని దెబ్బతీసే చర్యల్ని ప్రతిఘటిస్తామని సురవరం సుధాకర్ అన్నారు.




