హైదరాబాద్, మే 22 : ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. విభజన , ఉద్యోగ పంపిణీ, ఇతర కీలక అంశాలపై చంద్రబాబుకు సీఎస్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో అమలుకు తోడ్పాటు అందించాలని కోరారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు బాగా పనిచేశారని అధికారలకు చంద్రబాబు కితాబిచ్చారు. అయితే ఆ ఫలితాలను రాజకీయంగా ఉపయోగించుకోలేకపోయామని వివరణ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర సహకారం కూడా ఉంటుందని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.




