
హైదరాబాద్,మే 22 : రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం జరుగనున్న ఎంసెట్ మెడికల్‌కు ‘ఆర్’ కోడ్ ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మెడిసిన్ పరీక్ష కోసం 227 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,12,851 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించనున్నారు.




