Tuesday, 3 November 2026

థాయిలాండ్‌లో సైనిక పాలన

బ్యాంకాక్ : థాయిలాండ్‌లో సైనిక పాలన మొదలైంది. థాయిలాండ్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్షాలు… రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ కొంతకాలంగా పాలనపక్షానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రధాని తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా జీవనానికి భంగం కలుగుతోందని థాయ్ పాలనను సైన్యం అదుపులోకి తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *