సిట్ ఏర్పాటుకు కేంద్రానికి వారం గడువు ఇచ్చిన ధర్మాసనం
2009లో ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత రామ్‌జఠ్మలానీతో పాటు, పలువురు ఎన్జీవోలు కలిసి నల్లధనంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో సుమారు ఐదువందల మిలియన్ డాలర్లు ఉందని, ఇండియాలో పన్నులను ఎగవేసి ఆ ధనాన్ని విదేశాల్లోని బ్యాంకుల్లో దాచుకున్నారని, ఆ మొత్తాన్ని తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సుప్రీం 2011 జులైలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ బృందం ప్రత్యేక్ సిట్‌ను ఏర్పాటు చేయాలని అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీపీజీవన్ నేతృత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయడానికి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేస్తూ పలుమార్లు సుప్రీంను ఆశ్రయించింది. ఖచ్చితంగా సిట్‌ను ఏర్పాటు చేయాల్సిందే అంటూ ఆల్తమస్ కబీర్,సుదర్శన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 23, 2011న తీర్పును వెలువడించింది. మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎండీ షా నేతృత్వంలో ప్రత్యేక్ సిట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై మే 1 లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అలాగే ప్రత్యేక టీంను ఏర్పాటు చే స్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి సుప్రీంను కేంద్రం ఆశ్రయించింది. యూపీఏ2 సర్కారు వెళ్లి ఎన్డీయే కొత్త ప్రభుత్వం రానున్నందున సిట్ ఏర్పాటుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. కేంద్రం పిటిషన్‌పై సుప్రీం ప్రత్యేక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఎండీ షా నేతృత్వంలో ప్రత్యేక సిట్ ఏర్పాటుకు మరో వారం రోజులు గడువు విధిస్తూ తాజాగా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.




