కర్నాటకలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన మోదీ భార్య
కర్నాటక, మే 23 : భారత భావి ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోద కర్నాటక కొప్పాల జిల్లాలోని అంజనాద్రి పర్వత ప్రాంతాన్ని రెండు రోజుల క్రితం సందర్శించుకున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన పర్యాటక బృందంతో పాటు ఆమె పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటున్నారు. బుధవారం అంజనాద్రి పర్యతాన్ని, పంపా సరోవరాన్ని సందర్శించారు. యశోద గంటన్నరసేపు అక్కడే గడిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి మందిరంలో యశోద మంగళహారతులు సమర్పించారు. అక్కడి నుంచి యశోద రామేశ్వరానికి పయనమైనట్లు తెలుస్తోంది.