ఆఫ్ఘనిస్తాన్, మే 23 : హెరాత్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ముగ్గురు ఆగంతకులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన ఆఫ్ఘన్ ఆర్మీ, ఐటీబీపీ జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు దుండగులు హతమైనట్లు తెలుస్తోంది. మరో ఆగంతకుడిని మట్టుపెడ్డటానికి జవాన్లు ప్రయత్నిస్తున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. భారత రాయబార కార్యాలయంలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయం వద్ద భద్రతను అధికం చేశారు. కాల్పులకు తెగడిన దుండగులు ఆత్మాహుతి దళ సభ్యులుగా తెలుస్తోంది. అయితే వారు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది.




