ఇస్లామాబాద్ : పాకిస్థాన్ రాజధాని నగరం శనివారం ఉదయం బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. పేలుడులో ఒకరు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ నడిబొడ్డుకు అత్యంత సమీపంలోని సెక్టార్ ఎఫ్-6లో షహీన్ స్టోర్ దగ్గర్లో విలాసవంతమైన సూపర్ మార్కెట్‌పై దాడి జరిగిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. “సూపర్ మార్కెట్‌లో మరికాసేపట్లో బాంబు పేలుతుందనగా స్థానిక సెక్యురిటీ గార్డు ఒక అనుమానితుని అడ్డుకున్నాడని కోసర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. అతడిని(సెక్యురిటీ గార్డు) పాలిక్లినిక్ ఆస్పత్రికి తరలించారు” అని ట్రిబ్యూన్ పేర్కొంది. కాగా జి-9 మార్కజ్‌లోని కరాచీ కంపెనీ దగ్గర్లో ఒక కారులో రెండో పేలుడు సంభవించిందనే వార్తలు కూడా వచ్చాయని డైలీ తెలిపింది.
Related