లండన్: బీసీసీఐపై నిప్పులు చెరిగే ఐపీఎల్ బహిషృత కమిషనర్ లలిత్ మోడీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఫిక్సర్లు నడిపిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (అంతర్జాతీయ అవినీతిపరుల మండలి)గా తయారైందని దుయ్యబట్టాడు. బీసీసీఐ పదవి కోల్పోయినా అంతర్జాతీయ సంఘం చైర్మన్ పీఠాన్ని అధిష్టించాలని శ్రీనివాసన్ సిద్ధమవడం, అందుకు ఐసీసీ కూడా సుముఖంగా ఉండడాన్ని తప్పుపడుతూ లలిత్ ట్విట్టర్‌లో ఇలా కామెంట్ చేశాడు. క్రికెట్ ప్రక్షాళనకు ఐసీసీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నాడు.




