Tuesday, 3 November 2026

ఇడి కేసులో రాజా, కనిమొళి కోర్టుకు హాజరు

న్యూఢిల్లీ : 2జి కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) దాఖలు చేసిన చార్జిషీట్‌లో బెయిల్ కోరుతూ మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి, మరో ఏడుగురు నిందితులు ఢిల్లీ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఇడి దాఖలు చేసిన చార్జిషీట్ ను పురస్కరించుకుని సమన్లు దాఖలు కావడంతో సోమవారం కోర్టుకు హాజరైన నిందితులు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులపై మే 28ని విచారణ తేదీగా కోర్టు ఖరారు చేసింది.కాగా, ఈ కేసులో నిందితులలో ఒకరైన డిఎంకె అధినేత ఎం. కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కోర్టుక హాజరు కాలేదు. ఆమె తరఫున హాజరైన న్యాయవాది దయాళు అమ్మాళ్ ‘సరైన మానసిక స్థితి’లో లేనందున ఆమెను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు. కాగా, ఈ ఒక్కరోజుకు మాత్రం ఆమెను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించిన పత్రాలన్నిటినీ నిందితులకు అందచేయాలని సిబిఐ ప్రత్యేక జడ్జి ఓపి సైనీ ఇడిని ఆదేశించారు.రాజా, కనిమొళితోపాటు స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయంకా, కుసెగావ్ ఫ్రూట్స్, విజిటబుల్స్ ప్రైవేట్ లిమిటె్ డైరెక్టర్లు ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరాని, కళైంజర్ టివి ఎండి శరద్ కుమార్, పి. అమృతం సోమవారం కోర్టుకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *