థానే : ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పాల్గర్ తాలుకాలోని బోయిసర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ పోలీసుల కథనం మేరకు షకీల్ అబ్దుల్ అన్సారీ, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ పరారీలో ఉన్నాడు. బోయిసర్ పారిశ్రామిక ప్రాంతంలో బాధితురాలు పని చేస్తోంది. విధులు గించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Related