అదంతా మీ నేతల దుష్ప్రచారమే
కేసీఆర్ మాటలకు పెడర్ధాలు తీయొద్దు
సీమాంధ్ర ఉద్యోగులకు శ్రీనివాస్‌గౌడ్ వినతి
హైదరాబాద్, మే 25 : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలకు పెడర్థాలు తీయొద్దని టీజీవో శాశ్వత అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ నూతన ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. “తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు నిలపాల్సిన బా ధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. దానర్థం సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లగొట్టడం కానే కాదు. ఉద్యోగులు ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాలని మాత్రమే చెబుతున్నాం. ఇప్పుడు ఎలాగూ రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి కాబట్టి, అటూ ఇటూ ఉద్యోగులు సహకరించుకోవాలి. తమ తమ రాష్ట్రాల అభి వృద్ధిలో భాగస్వాములు కావాలి. విడిపోవడంలోనే ప్రేమాభిమానాలు పెరుగుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం ఉద్యోగ ఉద్యమంలో పాల్గొని.. టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ఆదివారమిక్కడ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రవాణశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోషియేషన్ ప్రతినిధులు ఆత్మీయ సత్కారం చేశారు. “ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని అందరికీ అదర్శంగా నిలిచారు.
తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించారు. ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అంకితం అయ్యారు. వారంతా ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మా ణంలోనూ అంతే చురుగ్గా పాల్గొనాలి” అని కోరారు. తెలంగాణ ఉద్యమమే లేకపోతే కొంతమంది ఉద్యోగులు బానిస బతుకులు బతకాల్సి వచ్చేదని అన్నారు. కొంత మంది సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. “సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేవిధంగా ఉన్న వీరి వైఖరి ఉంది. వారి మాటలు విని సీమాంధ్ర ఉద్యోగులు అయోమయానికి గురికావద్దు” అని కోరా రు. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందిస్తున్నా.. రవాణా శాఖ సిబ్బంది బాగోగులపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “రెవిన్యూ లక్ష్యాలను ఇస్తారు తప్ప అధికారులు, సిబ్బంది ఎలా ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోరు. రాయలసీమ ప్రాంతానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులను ఆపితే ఎంత గొడవ చేశారో తెలుసు. కొంత మంది ఒక బస్సు నంబర్ ప్లేట్‌తో పదిబస్సులు నడిపిస్తూ ఆర్టీఏ ఆదాయానికి గండికొట్టారని విమర్శించారు. ఇకపై అలాంటి ఆటలు సాగవు” అని హెచ్చరించారు.




