Tuesday, 3 November 2026

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

40కి పెరిగిన మృతుల సంఖ్య, 100మందికిపైగా తీవ్రగాయాలు
సంత్ కబీర్ నగర్(ఉత్తరప్రదేశ్) : ఉత్తర ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఘటనలో మరో 100 మందికిపైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా సంత్ కబీర్‌నగర్‌ సమీపంలో ఆగివున్న గూడ్స్ రైలును గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొనడంతో ఇది చోటు చేసుకుంది. మొత్తం ఆరు బోగీలు ప్రమాదానికి గురవ్వగా నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో రైలు 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే దాన్ని అదుపుచేయలేక పోయినట్లు సమాచారం.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృత దేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *