Tuesday, 3 November 2026

ఆఫ్ఘన్ అధ్యక్షుడితో ప్రధాని మోడి భేటీ

న్యూఢిల్లీ : ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడి సార్క్ దేశాలతో సత్సంబంధాల కోసం చర్చలు మొదలుపెట్టారు. ఈ రోజు అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా దేశాధ్యక్షులు చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోడి భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా ఈ రోడు పీఎంఓ కార్యాలయానికి చేరుకున్న మోడి ముందుగా కేబినేట్ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. అనంతరం సార్క్ నేతలతో చర్చలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *