న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. సార్క్ దేశాలు ప్రపంచ శక్తిగా ఎదగాలని మోడీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాము పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నామని అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు తాను కృషిచేస్తానని తెలిపారు.




