Monday, 2 November 2026

ఎన్టీఆర్ మళ్లీ జన్మించాలి: జూ.ఎన్టీఆర్

హైదరాబాద్ : తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండటమే మహానటుడు ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని టీడీపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్బంగా ఆయన కుటుంబసభ్యులు బుధవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నందమూరి తారక రామారావుకి నివాళులర్పించారు. అనంతర హరికృష్ణ మాట్లాడుతూ… ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని హరికృష్ణ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జయంతిని ప్రజలు పండుగగా జరుపుకోవాలన్నారు.

హరికృష్ణతోపాటు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్నలతోపాటు ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి కూడా ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ మళ్లీ జన్మించాలని కోరుకుంటున్నట్లు జూ. ఎన్టీఆర్ తెలిపారు. మహానటుడు ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని దర్శకుడు వైవీఎస్ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులతోపాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీలు ఎన్టీఆర్కు నివాళులర్పించినవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *