Monday, 2 November 2026

ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీఅయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి దిగ్విజయ్‌సింగ్, వాయలార్ రవి హాజరయ్యారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో పాటు ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎల్పీ పదవికోసం సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డికే. అరుణ, గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పోటీపడుతున్నారు. సీఎల్పీ నేతను ఎన్నుకునే విషయంలో సభ్యుల మధ్య సయోధ్య కుదరడం లేదు. సమావేశంలో ఏకాభిప్రాయానికి సభ్యులు రాకపోతే ఎన్నిక నిర్వహించడం ద్వారా సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *