Monday, 2 November 2026

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. ముండేకు సంతాపం

న్యూ ఢిల్లీ : 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటగా లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రమాణం చేశారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రారంభమైన సభా సమావేశాల్లో.. మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు సంతాపం తెలుపుతూ సభ్యులంతా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ తరువాత లోక్‌సభ సమావేశాలను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *