Monday, 2 November 2026

నిషేధం ఎత్తివేసే ఆంశం కేబినెట్‌లో చర్చిస్తా

home
జనజీవన స్రవంతిలోకి రండి

మావోయిస్టులకు ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు

హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి):

నిషేధం ఎత్తివేసే ఆంశం కేబినెట్‌లో చర్చిస్తానని మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తామని, మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయిని మంగళవారం ప్రింట్‌, ఎలక్టాన్రిక్‌ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో మావోయిస్టుల సమస్య పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవితంలోకి రావాలని కోరారు. మావోయిస్టులపై నిషేధం ఎత్తివేస్తారా? అని విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు ఈ అంశంపై తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని బదులిచ్చారు. కేబినెట్‌లో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన విషయాన్ని ¬ం మంత్రి వద్ద ప్రస్తావించగా అందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు, యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేశారని గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది సంఖ్య పెంచి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత అంశంపై కేసీఆర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *