హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను మచ్చ లేకుండా నిర్వర్తిస్తామన్నారు. ప్రజాసంక్షేమం కోసం అవసరమైతే అప్పు చేస్తామని తెలిపారు. ఎన్నిక ల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రైతు రుణాలుమాఫీ చేస్తామన్నారు. తెలంగాణను సుసంపన్న రాష్ట్రం చేస్తామని, భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి ఈటెల పేర్కొన్నారు.




