నల్గొండ, జూన్ 4 : జిల్లాలోని కట్టంగూరు దగ్గర హైవేపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఓ ద్విచక్రవాహనాన్ని గరుడ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు భువనగిరి మండలం రాయగిరి ప్లైవోవర్‌పై ఓ ఇసుక లారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.




